Chevireddy Bhaskar Reddy: చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చెవిరెడ్డి... ఆసుపత్రికి తరలింపు

Chevireddy Bhaskar Reddy suffering from skin disease in jail
  • లిక్కర్ స్కాం కేసులో జైల్లో ఉన్న చెవిరెడ్డి
  • జైల్లో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వైనం
  • చర్మ వ్యాధికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించిన జైలు అధికారులు
లిక్కర్ స్కాం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైల్లో ఉన్న ఆయన పలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. కొంత కాలంగా ఆయన చర్మ సంబంధింత వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని జైలు అధికారులకు ఆయన తెలియజేశారు. 

దీంతో, ఈ విషయాన్ని జైలు అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు చెవిరెడ్డిని జైలు సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. ప్రస్తుతం చెవిరెడ్డి ఆరోగ్యం బాగుందని అధికారులు వెల్లడించారు.

మరోవైపు, గత నెల కూడా వైద్య పరీక్షల నిమిత్తం చెవిరెడ్డిని ఆసుపత్రికి తీసకెళ్లారు. వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
Chevireddy Bhaskar Reddy
Chevireddy Bhaskar Reddy health
YSRCP
Vijayawada jail
Skin disease
Varicose veins
Liquor scam case
Andhra Pradesh news

More Telugu News