Bangladesh-India: భారత హైకమిషనర్‌ను పిలిపించుకున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం

Bangladesh Summons Indian High Commissioner Pranay Verma
  • భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను పిలిపించుకున్న బంగ్లాదేశ్
  • భారత్‌లోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాల భద్రతపై ఆందోళన
  • ఢిల్లీ, కోల్‌కతాలో భద్రతా పరిస్థితులపై చర్చ
  • దౌత్య సిబ్బంది రక్షణకు చర్యలు కోరిన బంగ్లాదేశ్
భారత్‌లో ఉన్న బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాల భద్రతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక దౌత్య చర్యకు దిగింది. మంగళవారం బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను పిలిపించుకుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి ఆసద్ ఆలం సియాం ధృవీకరించారు.

ఢిల్లీ, కోల్‌కతా సహా భారత్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాల చుట్టూ ఇటీవల ఏర్పడిన పరిస్థితులే ఈ సమావేశానికి కారణమని దౌత్య వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో చోటుచేసుకున్న నిరసనలు, ఆందోళనలు బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాల భద్రతపై ప్రభావం చూపవచ్చన్న భయం వ్యక్తమవుతోంది.

ఈ భేటీలో బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాల భద్రతను కట్టుదిట్టంగా నిర్వహించాల్సిన అవసరాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌కు స్పష్టం చేసినట్లు సమాచారం. దౌత్య సిబ్బంది రక్షణతో పాటు కార్యాలయాల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది.
Bangladesh-India
Pranay Verma
High Commission
Diplomatic Security
Dhaka
Delhi
Kolkata
Bangladesh Missions
Foreign Ministry

More Telugu News