Bank Holidays 2026: 2026 జనవరిలో బ్యాంక్ హాలిడేస్ వివరాలు ఇవిగో

Bank Holidays 2026 List Released by RBI
  • జనవరి 2026లో మొత్తం 15 బ్యాంకు సెలవులు 
  • రాష్ట్రాల వారీగా స్థానిక పండుగల ఆధారంగా మారతాయని వెల్లడి
  • ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథాతథం  
జనవరి 2026 నెలలో బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ఇందులో జాతీయ, రాష్ట్ర పండుగలు, అలాగే వారాంతాలైన ఆదివారాలు, రెండో మరియు నాలుగో శనివారాలు ఉన్నాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా వర్తించవని, రాష్ట్రాల వారీగా స్థానిక పండుగల ఆధారంగా మారుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. 

అయితే, బ్యాంక్ బ్రాంచ్‌లు మూసివున్నా, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ, నెఫ్ట్, ఐఎంపీఎస్, మొబైల్ బ్యాంకింగ్ ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయని తెలిపింది.
 
జనవరి 2026లో ముఖ్యమైన బ్యాంక్ సెలవులు 

జనవరి 1: న్యూ ఇయర్ డే / గాన్-న్గై (కొన్ని రాష్ట్రాలు)
జనవరి 2: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ / మన్నం జయంతి
జనవరి 12: స్వామి వివేకానంద జయంతి
జనవరి 14: మకర సంక్రాంతి / మాఘ్ బిహు
జనవరి 15: ఉత్తరాయణ పుణ్యకాలం/పొంగల్/ మాఘే సంక్రాంతి
జనవరి 16: తిరువళ్లువర్ డే (ప్రధానంగా తమిళనాడు)
జనవరి 17: ఉజవర్ తిరునాళ్
జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి / సరస్వతీ పూజ / బసంత పంచమి
జనవరి 26: రిపబ్లిక్ డే (జాతీయ సెలవు - అన్ని రాష్ట్రాలు)

వీకెండ్స్ (బ్యాంక్ సెలవులు)

జనవరి 4: ఆదివారం
జనవరి 10: రెండో శనివారం
జనవరి 11: ఆదివారం
జనవరి 18: ఆదివారం
జనవరి 24: నాలుగో శనివారం
జనవరి 25: ఆదివారం

మీ రాష్ట్రం లేదా నగరానికి సంబంధించిన కచ్చితమైన బ్యాంక్ సెలవుల జాబితా కోసం సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ లేదా ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు. బ్యాంక్ సెలవులను దృష్టిలో పెట్టుకుని చెక్ క్లియరెన్స్, లోన్ పేమెంట్స్ వంటి ఆర్థిక లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Bank Holidays 2026
RBI
Reserve Bank of India
January 2026 Holidays
Indian Bank Holidays
Public Holidays India
New Year Day
Republic Day
Sankranti
Weekend Bank Holidays

More Telugu News