Hyderabad Drugs: హైదరాబాదులోని కో- లివింగ్ హాస్టల్ లో డ్రగ్స్ దందా

Hyderabad Drugs Racket Busted in Co Living Hostel
  • ఇద్దరు సరఫరాదారులు, ముగ్గురు వినియోగదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వారి వద్ద నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్‌తో పాటు 6 సెల్ ఫోన్ల స్వాధీనం
  • నిందితులను రాయదుర్గం పోలీసులకు అప్పగించిన ఎస్‌వోటీ పోలీసులు
హైదరాబాదులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్‌లోని కో లివ్ గెర్నట్ పీజీలో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను, డ్రగ్స్ వినియోగిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్‌తో పాటు 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వంశీ దిలీప్, బాల ప్రకాశ్‌లను, హైదరాబాద్‌కు చెందిన మణికంఠ, రోహిత్, తరుణ్‌లను వినియోగదారులుగా గుర్తించారు. నిందితులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన అనంతరం, వారిని తదుపరి విచారణ కోసం రాయదుర్గం పోలీసులకు ఎస్‌వోటీ పోలీసులు అప్పగించారు. 
Hyderabad Drugs
Hyderabad
Drugs Case
Raidurgam Police
MDMA
OG Kush
Vamshi Dilip
Bala Prakash
Manikanta
Rohit
Tarun

More Telugu News