రఘునాథ్ మృతి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు కుమారుడు, కుమార్తె , డీఎస్పీ అరెస్ట్
- 2019 మే నెలలో బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని నిందితుల గెస్ట్‌హౌస్‌లో శవమై కనిపించిన రఘునాథ్
- ఆయనది ఆత్మహత్యేనని నిర్ధారించి కోర్టుకు తెలిపిన అప్పటి ఇన్‌స్పెక్టర్ మోహన్
- న్యాయపోరాటం కొనసాగించిన రఘునాథ్ భార్య
- కేసును సీబీఐకి అప్పగించిన హైకోర్టు విస్తృత ధర్మాసనం
- ఐదేళ్లనాటి కేసులో అరెస్టులు మొదలు
ఐదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రఘునాథ్ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఈ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజతో పాటు అప్పట్లో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన ప్రస్తుత డీఎస్పీ మోహన్‌ను సోమవారం అరెస్ట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ భూ లావాదేవీలు నిర్వహించే రఘునాథ్, 2019 మే నెలలో బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని నిందితుల గెస్ట్‌హౌస్‌లో శవమై కనిపించడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది.
అయితే ఇది ఆత్మహత్య కాదని, పక్కా ప్రణాళికతో జరిగిన హత్యని రఘునాథ్ భార్య మంజుల మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. తన భర్తను కిడ్నాప్ చేసి, ఆపై హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని బెంగళూరు హెచ్‌ఏఎల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కుట్రలో ఆదికేశవులు నాయుడు కుటుంబ సభ్యులతో పాటు మరికొందరి ప్రమేయం ఉందని ఆమె ఆరోపించారు. అప్పట్లో ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న మోహన్ ఈ కేసును విచారించి, ఇది ఆత్మహత్యేనని తేలుస్తూ కోర్టుకు బీ-రిపోర్ట్ సమర్పించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సిట్ కూడా దాదాపు అదే తరహా నివేదిక ఇవ్వడంతో మంజుల న్యాయపోరాటం కొనసాగించారు.
హైకోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఆశ్రయించిన కల్పజకు ఊరటనిస్తూ, న్యాయస్థానం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ చెన్నై విభాగం రంగంలోకి దిగడంతో అసలు నిజాలు వెలుగులోకి రావడం మొదలయ్యాయి. నిందితులు నకిలీ స్టాంప్ పేపర్లను సృష్టించి రఘునాథ్‌కు చెందిన విలువైన ఆస్తులను అక్రమంగా తమ పేరిట రాయించుకున్నట్లు సీబీఐ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దర్యాప్తును పక్కదారి పట్టించారనే ఆరోపణలపై డీఎస్పీ మోహన్‌ను, ప్రధాన నిందితులుగా ఉన్న శ్రీనివాస్, కల్పజలను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.