LIC Housing Finance: గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గించిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

LIC Housing Finance Slashes Home Loan Interest Rates
  • ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ
  • ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయం
  • వడ్డీ రేటు 7.15 శాతానికి తగ్గిస్తూ ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ నిర్ణయం
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్) గృహ రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను 7.15 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఈ తగ్గింపు నిర్ణయం నేటి నుంచి అమలులోకి వస్తుందని సంస్థ తెలిపింది.

ఈ మేరకు ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ ఎండీ అండ్ సీఈవో త్రిభువన్ అధికారి మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఆర్బీఐ 125 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించిందని తెలిపారు. ఇది గృహ రుణాలు తీసుకునే వారికి కొంత భారం తగ్గిస్తుందని ఆయన అన్నారు. 2026లోకి అడుగుపెట్టనున్న ఈ సమయంలో వడ్డీ రేట్ల తగ్గింపు గృహ రుణాల డిమాండ్‌కు ఊతమిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆర్బీఐ ఇటీవల రెపో రేటు తగ్గించిన తరువాత పలు బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ క్రమంలో ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ కూడా రుణ గ్రహీతలకు ఊరట కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది.
LIC Housing Finance
LIC HFL
Home Loan Interest Rates
RBI Repo Rate
Tribhuwan Adhikari
Housing Finance

More Telugu News