పీవీ సునీల్ కుమార్ పై డీజీపీకి ఫిర్యాదు చేసిన రఘురామ
- డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై ఐపీఎస్ సునీల్ కుమార్ తీవ్ర ఆరోపణలు
- అన్ని పదవుల నుంచి రఘురామను వెంటనే తొలగించాలని డిమాండ్
- ఆయన అరెస్టయితే అమరావతి బ్రాండ్ దెబ్బతింటుందని వ్యాఖ్య
- సునీల్ కుమార్‌పై డీజీపీకి ఫిర్యాదు చేసిన రఘురామ
- సర్వీస్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ప్రత్యారోపణలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరింది. రఘురామపై సునీల్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఆయన్ను అన్ని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేయడం తెలిసిందే. దీనికి ప్రతిగా, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న సునీల్ కుమార్‌ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలంటూ రఘురామ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
రఘురామకృష్ణరాజుపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సునీల్ కుమార్... ఆయన్ను, ఆయన కుటుంబసభ్యులను అరెస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయితే అది రాష్ట్రానికే తలవంపులని, అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని తెలిపారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, నారా లోకేశ్ కష్టపడి తెస్తున్న పెట్టుబడులు వెనక్కిపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
న్యాయం అందరికీ సమానంగా ఉండాలని, తనను సస్పెండ్ చేసినప్పుడు రఘురామను కూడా పదవి నుంచి తప్పించాలని సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. కేసు విచారణ పూర్తయి, న్యాయస్థానంలో నిర్దోషిగా తేలిన తర్వాత ఆయనకు ఏ పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
సునీల్ కుమార్ ఆరోపణలపై రఘురామకృష్ణరాజు తీవ్రంగా స్పందించారు. సునీల్ కుమార్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఆన్‌లైన్ వీడియోలో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని పేర్కొంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయనపై తక్షణమే డిస్మిసల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలని కోరారు.