Vijay Deverakonda: 'రౌడీ జనార్ధన్' సినిమాలో విజయ్ దేవరకొండ మొదటిసారి గోదావరి యాసలో మాట్లాడతాడు: దిల్ రాజు
- 'రౌడీ జనార్ధన్' గ్లింప్స్ లాంచ్
- విజయ్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు పోషించని పాత్రలో కనిపిస్తాడన్న దిల్ రాజు
- ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు నచ్చితే అలాగే తీయాలన్న నిర్మాత
యంగ్ హీరో విజయ్ దేవరకొండ మొట్టమొదటిసారిగా 'రౌడీ జనార్ధన్' చిత్రంలో గోదావరి యాసలో మాట్లాడతాడని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, విజయ్ కెరీర్‌లో ఇంతవరకు పోషించని ఒక విభిన్నమైన పాత్రలో ఈ చిత్రంలో కనపడతాడని అన్నారు.
అంతేకాకుండా, ఇందులో విజయ్ పూర్తిస్థాయి మాస్ పాత్రను పోషిస్తున్నాడని పేర్కొన్నారు. ఇది 80వ దశకం నాటి కథాంశంతో రూపొందుతోందని తెలిపారు. 2026లో తమ నిర్మాణ సంస్థ నుంచి 6 సినిమాలు విడుదల కానున్నాయని వెల్లడించారు.
మీ బ్యానర్ నుంచి ఇంతకుముందు రక్తపాతంతో హింసాత్మక సినిమాలు రాలేదని విలేకరి అడిగిన ప్రశ్నకు దిల్ రాజు సమాధానమిస్తూ, ఈ మధ్యకాలంలో ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు నచ్చుతున్నాయో గమనిస్తున్నామని, వారి అభిరుచులకు అనుగుణంగానే సినిమాలు తీస్తామని అన్నారు. ఈ సినిమా అభిమానులకు డబుల్ మీల్స్ అయితే, ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ వంటి విందు భోజనం అని పేర్కొన్నారు.