GHMC: జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై హైకోర్టు వ్యాఖ్యలు

GHMC Division Reorganization Petitions Dismissed by High Court
  • వార్డుల పునర్వ్యవస్థీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల కొట్టివేత
  • ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పిన హైకోర్టు
  • డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
జీహెచ్ఎంసీ వార్డుల పునర్వ్యవస్థీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. డివిజన్ల పునర్విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై హైకోర్టులో విచారణ జరిగింది.

జీహెచ్ఎంసీలో డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఎంసీహెచ్‌ఆర్‌డీలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సమర్పించిన నివేదిక ఆధారంగా వార్డుల పునర్విభజన చేశామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఆ నివేదికను బహిర్గతం చేయలేదని, అభ్యంతరాల స్వీకరణకు తగినంత గడువు ఇవ్వలేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు.

చట్టపరిధిలోనే డీలిమిటేషన్ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది ఇటీవల కోర్టుకు వివరించారు. సమాచారం ఇప్పటికే వెబ్‌సైట్‌లో ఉంచామని, ఇప్పటి వరకు అందిన 3,100 అభ్యంతరాలను పరిష్కరిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది.
GHMC
GHMC divisions
Telangana High Court
ward delimitation
division reorganization
MCHRD

More Telugu News