Kandula Durgesh: నంది అవార్డులపై కీలక ప్రకటన చేసిన మంత్రి కందుల దుర్గేశ్

Kandula Durgesh Announces Key Decision on Nandi Awards
  • ఉగాది నాటికి నంది అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్న కందుల దుర్గేశ్
  • సినీ ప్రముఖులతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని వెల్లడి
  • ఏపీలో షూటింగులు చేసుకునే సినిమాలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్న మంత్రి
టాలీవుడ్ కి ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉగాది నాటికి నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనికి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. 

సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలోనే కీలక సమావేశం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. తొలుత సినిమాటోగ్రఫీ, హోంశాఖల నేతృత్వంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని... ఏపీలో షూటింగులు, సినిమా టికెట్ రేట్లు, హై బడ్జెట్ సినిమాల టికెట్ ధరలపై చర్చిస్తామని చెప్పారు. ఆ సమావేశం అనంతరం సినీ ప్రముఖులతో సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశాలకు సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఏపీలో షూటింగ్ చేసుకునే సినిమాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.
Kandula Durgesh
Nandi Awards
Telugu Cinema
Andhra Pradesh
Chandrababu Naidu
Tollywood
AP Film Industry
Movie Tickets
Film Shootings

More Telugu News