Duvvada Srinivas: బిగ్ బాస్ షోపై దువ్వాడ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
- చిట్టి పికిల్స్ రమ్య ఎందరికో ఆదర్శమన్న దువ్వాడ శ్రీను
- ఆమె చివరి వరకు ఉండాల్సిందని వ్యాఖ్య
- రమ్య ఎలిమినేట్ కావడం దారుణమన్న దువ్వాడ
ప్రముఖ రియాలిటీ సంస్థ బిగ్ బాస్ పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న చిట్టి పికిల్స్ రమ్య ఎంతో మందికి ఆదర్శమని... ఆమె చివరి వరకు ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఎందరికో స్ఫూర్తి అయిన రమ్యలాంటి మహిళలను ఎంకరేజ్ చేసి, వారిని గెలిపించి ఉంటే బాగుండేదని అన్నారు. రమ్య ఎలిమినేట్ కావడం దారుణమని చెప్పారు. దువ్వాడ శ్రీను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరోవైపు, బిగ్ బాస్ తెలుగు 9 షో విన్నర్ గా కల్యాణ్ పడాల నిలిచాడు. తనూజ రన్నరప్ గా నిలిచింది. విజేతగా ట్రోఫీతో పాటు రూ. 35 లక్షల ప్రైజ్ మనీ కల్యాణ్ అందుకున్నాడు.
మరోవైపు, బిగ్ బాస్ తెలుగు 9 షో విన్నర్ గా కల్యాణ్ పడాల నిలిచాడు. తనూజ రన్నరప్ గా నిలిచింది. విజేతగా ట్రోఫీతో పాటు రూ. 35 లక్షల ప్రైజ్ మనీ కల్యాణ్ అందుకున్నాడు.