Vicky Kaushal: దేశభక్తి మాత్రమే ఈ సినిమాల విజయానికి కారణం కాదు: విక్కీ కౌశల్
- ఘన విజయం సాధించిన 'ఛావా', 'ధురంధర్'
- దేశభక్తి కారణంగా ఈ చిత్రాలు విజయం సాధించాయంటూ కొందరి వ్యాఖ్యలు
- ఈ చిత్రాల్లో ఎన్నో ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయన్న విక్కీ కౌశల్
బాలీవుడ్ సినిమాలు ‘ఛావా’, ‘ధురంధర్’ ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ పొందాయి. ఈ రెండు చిత్రాలు ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాయి. అయితే, ఈ సినిమాలు హిట్ కావడానికి దేశభక్తి నేపథ్యమే ప్రధాన కారణమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై హీరో విక్కీ కౌశల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖలు చేశాడు.
“దేశభక్తి మాత్రమే సినిమా విజయానికి ఫార్ములా కాదు. నేపథ్యంతో పాటు సినిమాల్లో ఎన్నో ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి. దేశభక్తి అనేది నిర్వచించలేని అనుభూతి. దాన్ని మన సినిమాలు, సాహిత్యం, క్రీడల ద్వారా నిరంతరం చూపించాలి. మన దేశంపై గౌరవం, ప్రేమకు నిదర్శనమే ఇలాంటి చిత్రాలు. ‘ఛావా’ లాంటి గొప్ప చిత్రంలో నటించినందుకు నాకు గర్వంగా, ఆనందంగా ఉంది”
‘ఛావా’లో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ హిస్టారికల్ ఫిల్మ్ ఫిబ్రవరిలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.807 కోట్లు వసూలు చేసింది.
తాజాగా వచ్చిన ‘ధురంధర్’ సినిమా, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలపై భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన రహస్య ఆపరేషన్ ఆధారంగా రూపొందింది. 17 రోజులలో రూ.845 కోట్లు వసూలు చేసిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, దేశభక్తి అంశాలను మిళితం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.