Fanil Sharov: మాస్కోలో కారు బాంబు దాడి.. రష్యాకు చెందిన కీలక జనరల్ మృతి

Russian General Fanil Sharov Killed in Moscow Car Bombing
  • బాంబు దాడిలో మృతి చెందిన ఆపరేషనల్ అడిషనల్ ట్రైనింగ్ డైరెక్టర్ అధిపతి
  • ఆయన కారు కింద అమర్చిన పరికరం పేలడంతో మృతి
  • ఈ దాడి వెనుక ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ హస్తం ఉన్నట్లు అనుమానాలు
మాస్కోలో జరిగిన కారు బాంబు దాడిలో కీలక రష్యా సైనిక జనరల్ ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని రష్యా దర్యాప్తు సంస్థ వెల్లడించింది. రష్యా సాయుధ దళాల జనరల్ స్టాఫ్‌కు చెందిన ఆపరేషనల్ ట్రైనింగ్ డైరెక్టర్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఫనిల్ సర్వరోవ్‌, బాంబు దాడి ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో మరణించినట్లు ఆ సంస్థ తెలిపింది.

ఆయన కారు కింద అమర్చిన పరికరం పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్టుమెంట్ దగ్గర కారు పార్కింగ్ ప్రాంతంలో జరిగిన ఈ దాడి వెనుక ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ హస్తం ఉన్నట్లు రష్యా అధికారులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

గత మూడేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు వివిధ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదు. ఇటీవల కాస్పియన్ సముద్రంలోని రష్యా కీలక చమురు క్షేత్రంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు నిర్వహించింది. మున్ముందు మరిన్ని దాడులు చేస్తామని కూడా హెచ్చరించింది.
Fanil Sharov
Moscow
Car Bomb Attack
Russian General
Ukraine
Russia Ukraine War
Russia
Military
Assassination

More Telugu News