Pune election rally: విజయోత్సవ ర్యాలీలో మంటలు.. పూణేలో గెలిచిన అభ్యర్థికి గాయాలు.. వీడియో ఇదిగో!

Pune Councilor Injured in Victory Rally Fire at Jejuri Temple
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి ర్యాలీ
  • ఆలయం వద్ద పూజ చేయిస్తుండగా మంటలు
  • అభ్యర్థి సహా 16 మందికి గాయాలు
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. పూణేలో గెలిచిన ఓ అభ్యర్థి సాయంత్రం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న జేజురి ఆలయం ముందు మద్దతుదారులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆలయం ముందున్న ఖండరేయ భారీ విగ్రహం ముందు పసుపు జల్లగా.. విగ్రహం ముందున్న దీపం నుంచి మంటలు ఎగసిపడ్డాయి.

ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో కౌన్సిలర్ గా ఎన్నికైన అభ్యర్థితో పాటు ఆయన మద్దతుదారులు 16 మంది ‌‌గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాయపడ్డ వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనలో గాయపడ్డ కౌన్సిలర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని సమాచారం.
Pune election rally
Maharashtra local elections
Jejuri temple
Pune councilor injured
Nationalist Congress Party
Victory rally fire
Khandoberaya statue
Local body elections

More Telugu News