Tirumala: నేడు తిరుమల శ్రీవారి మార్చి నెల దర్శనం టికెట్ల విడుదల

Tirumala Darshan Tickets Released Today by TTD
  • ఉదయం 10 గంటలకు ఆన్ లైన్‌లో ఆర్జిత సేవా టికెట్లు
  • మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు
  • రేపు వృద్దులు, వికలాంగుల ప్రత్యేక దర్శనం, శ్రీవాణి, అంగ ప్రదక్షిణ టికెట్లు అందుబాటులోకి
ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన టికెట్ల కోటాను టీటీడీ నేడు విడుదల చేయనుంది. 2024 మార్చి నెలలో దర్శనాల కోసం ఈ టికెట్లను జారీ చేయనున్నారు. భక్తుల సౌకర్యార్థం వివిధ దర్శనాలు, సేవలకు సంబంధించి టికెట్లను దశల వారీగా ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

ఈ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు భక్తులకు అందుబాటులోకి వస్తాయి.

రేపు 23వ తేదీ (మంగళవారం) ఉదయం 10 గంటలకు వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేస్తుంది. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. అదే విధంగా, మధ్యాహ్నం 3 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

అలాగే 24వ తేదీ (బుధవారం) ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఇక దర్శన టికెట్ల కోసం భక్తులు అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ను మాత్రమే సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. 
Tirumala
TTD
Tirumala Tirupati Devasthanams
Sri Venkateswara Swamy
Darshan tickets
Online booking
Special darshan
Srivani tickets
Accommodation booking
Pilgrimage

More Telugu News