Pawan Kalyan: పదవులు పొందిన జనసేన నేతలతో నేడు పవన్ భేటీ

Pawan Kalyan to Meet Janasena Leaders Holding Posts Today
  • 3 వేల మందితో పదవీ - బాధ్యత పేరిట జనసేన సమావేశం
  • నేతలకు పార్టీ అధినేత దిశా నిర్దేశం చేస్తారన్న నాదెండ్ల మనోహర్
  • టెలీ కాన్ఫరెన్స్ లో నేతలకు తెలియజేసిన నాదెండ్ల మనోహర్
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన దాదాపు 3 వేల మందితో సమావేశం నిర్వహించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ విషయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.

నామినేటెడ్ పదవులు పొందిన వారితో పార్టీ అధినేత సోమవారం సమావేశం కానున్నారని ఆయన పేర్కొన్నారు. "పదవి - బాధ్యత" పేరుతో నిర్వహించే ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగే ఈ కార్యక్రమం గురించి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులతో నాదెండ్ల మనోహర్ నిన్న టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, కార్యక్రమ వివరాలను వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ తరపున నిర్వహిస్తున్న "పదవి - బాధ్యత" కార్యక్రమం అత్యంత కీలకమైన సమావేశమని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేయబోయే ప్రసంగం మనందరికీ మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు. 
Pawan Kalyan
Janasena
Andhra Pradesh
Nominated Posts
Nadeendla Manohar
AP Deputy CM
Political Meeting
Telugu News

More Telugu News