YS Jagan Mohan Reddy: థాంక్యూ షర్మిలమ్మ... బర్డ్ డే విషెస్ ట్వీట్ కు జగన్ రిప్లయ్
- నేడు జగన్ పుట్టినరోజు
- సోషల్ మీడియాలో విషెస్ వెల్లువ
- సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన షర్మిల
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ నేడు (డిసెంబరు 21) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు జగన్ పుట్టినరోజును ఘనంగా జరిపాయి. కాగా, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూడా తన సోదరుడికి బర్త్ డే విషెస్ తెలిపారు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారు. షర్మిల ట్వీట్ కు జగన్ స్పందించారు. థాంక్యూ షర్మిలమ్మ అంటూ రిప్లయ్ ఇచ్చారు.
జగన్ స్పందనతో వైసీపీ అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. గత కొంతకాలంగా జగన్, షర్మిల మధ్య విభేదాలు తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ పుట్టినరోజు సందర్భంగా షర్మిల శుభాకాంక్షలు తెలపడం, జగన్ కూడా షర్మిలమ్మ అంటూ స్పందించడం అభిమానులను ఆనందానికి గురిచేసింది.