Chandrababu Naidu: టీడీపీ జిల్లా అధ్యక్షుల పేర్లను ప్రకటించిన చంద్రబాబు
––
టీడీపీ లోక్‌సభ నియోజకవర్గ (జిల్లా) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను పార్టీ అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. ఎంపికైన నేతల పేర్ల జాబితాను టీడీపీ అధికారికంగా ప్రకటించింది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో అంకితభావంతో కష్టపడుతున్న కార్యకర్తలకు ఈ ఎంపికలో ప్రాధాన్యం ఇచ్చినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అభ్యర్థుల సామర్థ్యంతో పాటు సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, విధేయత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు.

