Wang: తిండిపోతు మాజీ ప్రియురాలి నుంచి ఖర్చులు ఇప్పించండి.. చైనా కోర్టులో ఓ ప్రియుడి దావా

Chinese Man Sues ExGirlfriend for Food Expenses Court Dismisses
  • ఆమె తిండి కోసం భారీగా ఖర్చు చేశానంటున్న యువకుడు
  • తాను 30 వేల యువాన్లు ఆమె కోసం వెచ్చించానని..
  • బ్రైడ్ ప్రైస్ కింద తన తల్లిదండ్రులు 20 వేల యువాన్లు ఇచ్చారని వెల్లడి
  • ఆ మొత్తం సొమ్ము ఇప్పించాలని కోర్టును ఆశ్రయించిన ప్రియుడు
చైనాలో ఓ యువకుడు తన మాజీ ప్రియురాలు, ఫియాన్సీని కోర్టుకీడ్చాడు. తనతో కలిసి ఉన్నప్పుడు ఆమె తిండి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశానని, ఆ సొమ్మంతా తిరిగిప్పించాలని కోరాడు. ఈ మేరకు కోర్టులో దావా వేశాడు. విచారించిన కోర్టు.. రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలో పెట్టిన ఖర్చు, కొనిచ్చిన వస్తువులతో ఇరువురూ భావోద్వేగ బంధాన్ని కలిగి ఉంటారని గుర్తుచేస్తూ, ఆ సొమ్ము తిరిగివ్వమనడం సరికాదని పేర్కొంటూ పిటిషన్ కొట్టేసింది. అయితే, బ్రైడ్ ప్రైస్ కింద యువకుడి తల్లిదండ్రులు ఇచ్చిన సొమ్ములో సగం తిరిగివ్వాలని మాజీ ప్రియురాలిని కోర్టు ఆదేశించింది. ఈ వింత దావా వివరాల్లోకి వెళితే..

నార్త్ ఈస్ట్రర్న్ చైనా హిలోంజియాంగ్ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన యువకుడు ‘హె’ (ఇంటిపేరు), వాంగ్ అనే యువతితో మాట్రిమోని యాప్ లో పరిచయం ఏర్పడింది. ఆపై ఇరువురూ కొంతకాలం రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆ సమయంలో హె తల్లిదండ్రులకు చెందిన హోటల్ లో వాంగ్ పనిచేసింది. ఆ తర్వాత హె, వాంగ్ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఆ సమయంలో సంప్రదాయం ప్రకారం హె తల్లిదండ్రులు బ్రైడ్ ప్రైస్ కింద 20 వేల యువాన్లు వాంగ్ కు ఇచ్చారు.

ఆరు నెలలు కలిసి ఉన్నాక వాంగ్ తీరుతో విసిగిపోయిన హె పెళ్లి రద్దు చేసుకున్నాడు. వాంగ్ కు పనికన్నా తిండిపైనే ఎక్కువ శ్రద్ధ ఉండేదని, తరచూ షాపింగ్ చేస్తూ తన డబ్బుతో పలు దుస్తులు ఇతరత్రా వ్యక్తిగత వస్తువులను కొనుగోలు చేసిందని హె ఆరోపించాడు. ఇందుకు 30 వేల యువాన్లు ఖర్చయిందని, బ్రైడ్ ప్రైస్ గా ఇచ్చిన 20 వేల యువాన్లు కలిపి మొత్తం 50 వేల యువాన్లు (రూపాయల్లో దాదాపు 6.3 లక్షలు) తిరిగిప్పించాలని కోర్టులో దావా వేశాడు. 

అయితే, ప్రియురాలి కోసం పెట్టిన ఖర్చు పట్ల సెంటిమెంటలాగా విలువ ఉంటుందని, ఆ సొమ్మును తిరిగివ్వమనడం సరికాదని జడ్జి పేర్కొంటూ కేసు కొట్టివేశారు. అయితే, బ్రైడ్ ప్రైస్ గా ప్రియుడి కుటుంబం ఇచ్చిన 20 వేల యువాన్లలో సగం సొమ్ము తిరిగివ్వాలని ప్రియురాలిని ఆదేశించారు.
Wang
China court case
ex-girlfriend expenses
bride price
Heilongjiang province
matrimony app
relationship expenses
Chinese law
failed engagement

More Telugu News