త్వరలో బడ్జెట్.. ప్రతిపాదనలు పంపించాలని కోరిన తెలంగాణ ఆర్థిక శాఖ

  • 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ రూపకల్పనకు శ్రీకారం
  • అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను కోరిన ఆర్థిక శాఖ
  • ఫిబ్రవరి లేదా మార్చి నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ కసరత్తు ప్రారంభమైంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనకు తెలంగాణ ఆర్థిక శాఖ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను కోరింది. జనవరి 3వ తేదీలోపు ప్రతిపాదనలు పంపించాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సూచించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సవరించిన ప్రతిపాదనలు కూడా పంపాలని కోరింది.

అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు అందిన తర్వాత, శాఖల వారీగా మంత్రులు, కార్యదర్శులతో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్షలు జరిపి బడ్జెట్ కేటాయింపుల అంచనాలపై చర్చిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

ప్రస్తుత ఏడాది పన్నుల ద్వారా రూ.1.75 లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటివరకు లక్ష కోట్ల రూపాయలు వచ్చినట్లు అంచనాలు ఉన్నాయి. మార్చి నాటికి పన్నుల వసూళ్లు బాగా పుంజుకుంటాయని భావిస్తున్నారు.


More Telugu News