Ram Pothineni: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఆంధ్రా కింగ్ తాలూకా'

Ram Pothinenis Andhra King Taluka Coming to OTT
షార్ట్స్‌లో చూడండి
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

మహేశ్ బాబు.పి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చింది. మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ, రామ్ నటన, కథలోని కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో రామ్ సరసన యువ నటి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, కన్నడ స్టార్ ఉపేంద్ర ఓ అత్యంత కీలక పాత్రలో కనిపించారు. రావు రమేశ్, రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

ఒక వీరాభిమాని తన అభిమాన నటుడి కోసం పడే తపన అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. సూపర్‌స్టార్ సూర్య (ఉపేంద్ర) తన 100వ సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వీరాభిమాని సాగర్ (రామ్ పోతినేని) ఎలా ఆదుకున్నాడనేది ఈ సినిమా కథ. మైత్రి మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వివేక్-మెర్విన్ సంగీతం అందించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనుంది.
Go Back to Shorts
Ram Pothineni
Andhra King Taluka
Ram Pothineni movie
Netflix
Bhagya Shree Borse
Upendra
Telugu movie OTT release
Vivek Mervin music
Mahesh Babu P direction
Sagar Andhra King Taluka

More Telugu News