హైదరాబాద్, వరంగల్‌ నగరాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆరుగురు అరెస్టు

  • కొత్త సంవత్సరం వస్తున్న నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు
  • 330 గ్రాముల గంజాయి, 3 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం
  • వరంగల్‌, మియాపూర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఆరుగురి అరెస్టు
హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆరుగురిని ఈగల్ టీమ్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో ప్రతి సంవత్సరం కొత్త సంవత్సర వేడుకల సమయంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడుతుండటం ఆనవాయతీగా వస్తోంది. మత్తు పదార్థాల వ్యాపారంలో 80 నుంచి 90 శాతం డిసెంబర్ - జనవరి మధ్య జరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆరుగురు డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసిన పోలీసులు, వారి నుంచి 330 గ్రాముల గంజాయి, 3 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ జిల్లాలో ముగ్గురు గంజాయి సరఫరాదారులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 80 గ్రాములు, మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య గంజాయిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.


More Telugu News