KCR: హైదరాబాద్ లోని నివాసానికి చేరుకున్న కేసీఆర్.. వీడియో ఇదిగో

KCR Reaches Hyderabad Residence Ahead of BRS Meeting
  • రేపు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం
  • రెండేళ్ల కాంగ్రెస్ పాలన, హామీల అమలుపై ప్రధానంగా చర్చ
  • ఉపఎన్నిక, సర్పంచ్ ఎన్నికల ఫలితాలపైనా సమీక్ష
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో జరగనున్న పార్టీ శాసనసభాపక్ష, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే, ఆయన కాసేపటి క్రితం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ నుంచి నగరంలోని నందినగర్ నివాసానికి వచ్చారు.

రేపు జరిగే సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వ పాలన తీరు, ఇచ్చిన హామీల అమలుపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే, ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, సర్పంచ్ ఎన్నికల ఫలితాలను కూడా సమీక్షించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వీటన్నింటితో పాటు, నదీ జలాల అంశంపై కీలక కార్యాచరణకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కృష్ణా నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి తాకట్టు పెట్టిందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
KCR
KCR Hyderabad
BRS Meeting
Telangana Bhavan
Telangana Politics
Krishna River Water
Congress Government Telangana
Jubilee Hills BRS
Telangana News

More Telugu News