S Jaishankar: ఈ విధమైన అధికారం ఏ ఒక్క దేశానికీ పరిమితం కాదు... దీనిని ఆ దేశాలు గుర్తించాలి: జైశంకర్

S Jaishankar says Power Not Limited to One Nation
  • శక్తిమంత దేశమైనా సరే తన ఇష్టాలను ఇతరులపై రుద్దవద్దన్న జైశంకర్
  • ప్రపంచీకరణ, మన ఆలోచన, పని విధానాల్లో ఎన్నో మార్పులు తీసుకు వచ్చిందన్న కేంద్రమంత్రి
  • పుణేలో సింబయోసిస్ ఇంటర్నేషనల్‌లో జరిగిన స్నాతకోత్సవంలో ప్రసంగం
అధికారం ఏ ఒక్క దేశానికీ పరిమితం కాదని, ఈ విషయాన్ని శక్తిమంతమైన దేశాలు గుర్తించాలని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. శక్తిమంతమైన దేశమైనా సరే తన ఇష్టాలను ఇతరులపై రుద్దడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలోని పుణేలో సింబయోసిస్ ఇంటర్నేషనల్‌లో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు.

ప్రపంచీకరణ మన ఆలోచన విధానంలో, పని విధానంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని, అనేక అధికార కేంద్రాలు ఉద్భవించాయని మంత్రి పేర్కొన్నారు. అధికారం అనే పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయని వ్యాఖ్యానించారు.

వాణిజ్యం, మిలిటరీ, ఇంధనం, సాంకేతికత, ప్రతిభ ఆధారంగా ఇవి మారుతుంటాయని అన్నారు. ఈ విధమైన అధికారం ఏ ఒక్క దేశానికీ పరిమితం కాదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రపంచాధిపత్యం కలిగిన దేశాలు గుర్తించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ప్రపంచ దేశాల మధ్య సహజమైన పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు. భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు తయారీ రంగంలో దూసుకెళ్లాల్సిన అవశ్యకతను ఆయన గుర్తు చేశారు.
S Jaishankar
Indian Foreign Minister
Global power
Globalization
International relations
Geopolitics

More Telugu News