టీ20 ప్రపంచకప్ కోసం భార‌త‌ జట్టు ప్రకటన... శుభ్‌మన్ గిల్‌ కు దక్కని చోటు

  • టీ20 ప్రపంచకప్, న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
  • కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్
  • జట్టులోకి ఇషాన్ కిషన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్
  • వికెట్ కీపర్ జితేశ్‌ శర్మకు కూడా దక్కని చోటు
2026 టీ20 ప్రపంచకప్‌తో పాటు న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఈ ఎంపికలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ కు వరల్డ్ కప్ టీమ్ లో చోటు దక్కలేదు. అతడిని వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా, ఏకంగా జట్టు నుంచే తొలగించారు.

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా కొనసాగనుండగా, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను కొత్త వైస్ కెప్టెన్‌గా నియమించారు. వికెట్ కీపర్ జితేశ్‌ శర్మ స్థానంలో మంచి ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించారు. అదేవిధంగా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లకు కూడా జట్టులో చోటు దక్కింది.

ఈ జట్టు ఎంపికలో ఇటీవలి ప్రదర్శనలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గిల్ ఫామ్ కోల్పోవడం, మరోవైపు ఇషాన్ కిషన్ నిలకడగా రాణించడం వంటి అంశాలు ఈ మార్పులకు కారణమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు.

భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్.


More Telugu News