అమెరికా దాటి వెళ్లకండి.. ఉద్యోగులకు గూగుల్ సూచన
- తిరిగి రావడానికి ఏడాది దాకా పట్టొచ్చని హెచ్చరిక
- వీసా స్టాంపింగ్ లో తీవ్ర ఆలస్యమవుతోందని ఉద్యోగులకు అంతర్గత మెమో
- విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సలహా
విదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో వీసా స్టాంపింగ్ ప్రక్రియలో 'తీవ్రమైన' జాప్యం జరుగుతోందని గూగుల్ పేర్కొంది. దీనివల్ల ఉద్యోగులు తమ స్వదేశాలకు వెళ్లి తిరిగి రావాలనుకుంటే భారీ ఆలస్యం తప్పదని తెలిపింది. ఈ హెచ్చరిక నేపథ్యంలో గూగుల్‌లో హెచ్-1బి వీసాలపై పనిచేస్తున్న వేలాది మంది భారతీయులు ఇండియాకు రావాలంటే ఆందోళన చెందుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు, వీసా నిబంధనల మార్పుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు భావిస్తున్నారు.