టీటీడీకి ఇండియన్ బ్యాంక్ భారీ విరాళం

  • అలిపిరి చెక్ పోస్ట్ వద్ద లగేజీ స్కానర్ ఏర్పాటు కోసం విరాళం
  • రూ.37,97,508 డీడీ అధికారులకు అందజేత
  •  టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి డీడీ అందించిన బ్యాంకు ప్రతినిధులు
తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు ఇండియన్ బ్యాంక్ ముందుకు వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు రూ.37,97,508 విరాళాన్ని అందజేసింది. అలిపిరి చెక్ పోస్ట్ వద్ద భక్తుల లగేజీని తనిఖీ చేసేందుకు అత్యాధునిక సెక్యూరిటీ స్కానర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ నిమిత్తం ఇండియన్ బ్యాంక్ ఈ విరాళాన్ని అందించింది.

తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో ఇండియన్ బ్యాంక్ ఫీల్డ్ మేనేజర్ ప్రణేశ్ కుమార్, రూ.37,97,508 డీడీని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ ఎం.సెల్వరాజ్, డిప్యూటీ జోనల్ మేనేజర్ ఇందిరా, తిరుమల బ్రాంచ్ మేనేజర్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. 


More Telugu News