మనసు గెలిచిన హార్దిక్.. కెమెరామెన్‌కు హగ్ ఇచ్చి సారీ చెప్పాడు.. ఇదిగో వీడియో!
- హార్దిక్ పాండ్యా బాదిన సిక్సర్ కెమెరామ్యాన్‌కు బలంగా తాకిన వైనం
- ఈ ఘటనలో కెమెరామ్యాన్ భుజానికి గాయం
- ఇన్నింగ్స్ ముగిశాక కెమెరామ్యాన్ వద్దకు పరుగెత్తిన పాండ్యా
- గాయాన్ని పరిశీలించి.. ఆలింగనం చేసుకుని క్షమాపణ కోరిన ఆల్‌రౌండర్
వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కేవలం 25 బంతుల్లో 63 పరుగులతో చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఐదు భారీ సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో అతను కొట్టిన ఓ సిక్సర్, బౌండరీ లైన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న కెమెరామెన్ భుజానికి బలంగా తాకింది. దీంతో అతడి భుజంపై గాయమైంది. వెంటనే స్పందించిన టీమిండియా ఫిజియో, అతనికి ప్రథమ చికిత్స అందించారు.
భారత ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యా నేరుగా ఆ కెమెరామ్యాన్ వద్దకు పరుగున వెళ్లాడు. అతని గాయాన్ని పరిశీలించి, ఐస్ ప్యాక్ పెట్టడంలో సహాయం చేశాడు. అనుకోకుండా జరిగిన పొరపాటుకు క్షమాపణగా అతడిని ఆలింగనం చేసుకుని తన పెద్ద మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, హార్దిక్ క్రీడా స్ఫూర్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.