Sanjoy Paul: భారతీయ సాంకేతిక నిపుణుడికి అమెరికాలో విశిష్ట గౌరవం

Sanjoy Paul Receives Prestigious Honor in America
  • ప్రతిష్ఠాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ ఇన్వెంటర్స్ (ఎన్ఏఐ) ఫెలోగా ఎంపిక
  • ఏఐ, నెట్వర్కింగ్ రంగాల్లో 95 పేటెంట్లు పొందిన పాల్
  • ప్రస్తుతం రైస్ యూనివర్సిటీలో కీలక బాధ్యతల నిర్వహణ
అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణుడు సంజోయ్ పాల్‌కు విశిష్ట గౌరవం లభించింది. విద్యా రంగంలో ఆవిష్కరణలు చేసేవారికిచ్చే అత్యున్నత పురస్కారమైన నేషనల్ అకాడమీ ఆఫ్ ఇన్వెంటర్స్ (ఎన్ఏఐ) ఫెలోషిప్‌కు ఆయన ఎంపికయ్యారు. 2025 సంవత్సరానికి గాను ప్రకటించిన 169 మంది సభ్యుల జాబితాలో పాల్‌కు స్థానం దక్కింది.

సంజోయ్ పాల్ ప్రస్తుతం రైస్ యూనివర్సిటీకి చెందిన రైస్ నెక్సస్ ఇన్నోవేషన్ హబ్, ఏఐ హ్యూస్టన్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అదే యూనివర్సిటీలో టెక్నాలజీ డెవలప్‌మెంట్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాంకేతిక రంగంలో పాల్ విశేషమైన కృషి చేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్ (IEEE) విభాగంలో ఆయన ఏకంగా 95 పేటెంట్ హక్కులు కలిగి ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి ఆధునిక సాంకేతిక విభాగాల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

భారతదేశంలోని ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన సంజోయ్ పాల్ గతంలో బెల్ ల్యాబ్స్, విప్రో, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ వంటి దిగ్గజ సంస్థల్లో సీనియర్ లీడర్‌షిప్, పరిశోధన బాధ్యతలు చేపట్టారు. ఏఐ, రోబోటిక్స్, 5జీ టెక్నాలజీల పరిశోధన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. తన కెరీర్‌లో థామస్ ఆల్వా ఎడిసన్ పేటెంట్ అవార్డు, విలియం ఆర్. బెన్నెట్ అవార్డు సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నారు. 
Sanjoy Paul
National Academy of Inventors
NAI Fellowship
Rice University
AI Houston
Indian American
Technology Innovation
Artificial Intelligence
Machine Learning
IEEE

More Telugu News