Rangareddy POCSO Court: 17 ఏళ్ల బాలికతో పెళ్లి... రంగారెడ్డి జిల్లా పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు

Rangareddy POCSO Court Verdict in Child Marriage Case
  • సరూర్ నగర్ పరిధిలో 2018లో బాలికకు బలవంతపు పెళ్లి
  • కేసులో బాలిక భర్త, తండ్రికి జీవిత ఖైదు
  • రూ.75 వేల చొప్పున జరిమానా విధించిన కోర్టు
రంగారెడ్డి జిల్లాలోని పోక్సో న్యాయస్థానం ఒక సంచలన తీర్పును వెలువరించింది. 17 ఏళ్ల బాలికతో బలవంతపు వివాహం, అత్యాచారం కేసులో నిందితులకు శిక్ష ఖరారు చేసింది. ఆమె భర్తకు, తండ్రికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. 2018 సంవత్సరంలో హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పరిధిలో ఈ బాలికకు బలవంతంగా వివాహం జరిపించారు.

ఈ కేసులో బాలిక భర్తకు, తండ్రికి జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.75 వేల చొప్పున జరిమానా విధించింది. అంతేకాకుండా, బాధితురాలికి రూ.15 లక్షల నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
Rangareddy POCSO Court
Child Marriage
Forced Marriage
Telangana
Saroon Nagar

More Telugu News