Priyanka Gandhi: వయనాడ్ అడవుల్లో దొరికే మూలికను వాడుతున్నాను: మోదీ సహా ఎంపీలతో ప్రియాంక గాంధీ చర్చ

Priyanka Gandhi Discusses Wayanad Herbs with Modi and MPs
  • సమావేశాలు ముగిసిన అనంతరం ఎంపీలకు స్పీకర్ తేనీటి విందు
  • ఆ మూలిక వల్ల తనకు అలర్జీ సమస్యలు పూర్తిగా తగ్గిపోయాయన్న ప్రియాంక
  • వీబీ-జీ రామ్ జీ బిల్లును అర్ధరాత్రి ఆమోదించడంపై ఎంపీల ప్రశ్న
  • ప్రతిపక్షాల గొంతులు అలసిపోవద్దని తాను కోరుకున్నానని మోదీ సరదా వ్యాఖ్య
వయనాడ్ అడవులలో లభించే ఒక మూలికను తాను వాడుతున్నానని, దానివల్ల తన అలర్జీ సమస్యలు పూర్తిగా తగ్గిపోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులతో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. డిసెంబర్ 1న ప్రారంభమై 19 రోజుల పాటు సాగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడీవేడి చర్చలు, విపక్షాల ఆందోళనలతో హోరెత్తాయి. ఈ సమావేశాలు ముగిసిన అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు తేనీటి విందు ఇచ్చారు.

ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, పలువురు అఖిలపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక వయనాడ్ మూలికల గురించి మాట్లాడారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ, ఏడాదిలో 125 రోజుల పాటు పని కల్పించే వికసిత్ భారత్ గ్యారెంటీ పర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీ-జీ రామ్ జీ) బిల్లును గురువారం అర్ధరాత్రి ఆమోదించిన విషయంపై అఖిలపక్ష ఎంపీలు ప్రధానితో చర్చించారు.

అర్ధరాత్రి చట్టాన్ని ఆమోదించడం ఆదర్శవంతంగా ఉండదని, కాబట్టి శీతాకాల సమావేశాలను పొడిగించి ఉండాల్సిందని ప్రధానమంత్రితో అన్నారు. అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తరుచూ నిరసనలు చేపట్టడం వల్ల పార్లమెంట్ సమావేశాల్లో అంతరాయాలు ఏర్పడ్డాయని, అరిచి అరిచి వారి గొంతులు అలసిపోవద్దని తాను కోరుకుంటున్నానని మోదీ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వారంతా చిరునవ్వులు చిందించారు.
Priyanka Gandhi
Wayanad
herbs
allergy relief
Narendra Modi
winter session
Om Birla

More Telugu News