Ikkis Movie: ధర్మేంద్ర చివరి చిత్రం ‘ఇక్కీస్’.. కంటతడి పెట్టిస్తున్న ట్రైలర్
- విడుదలైన ‘ఇక్కీస్’ మూవీ ట్రైలర్
- లెజెండరీ నటుడు ధర్మేంద్రకు ఇదే చివరి చిత్రం
- వార్ హీరో అరుణ్ ఖేతర్‌పాల్ బయోపిక్‌గా ఈ సినిమా
- ప్రధాన పాత్రలో అమితాబ్ మనవడు అగస్త్య నంద
- జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం
బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర నటించిన చివరి చిత్రం ‘ఇక్కీస్’ ట్రైలర్ విడుదలైంది. పరమవీర చక్ర పురస్కార గ్రహీత, సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కుతోంది. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద ఇందులో హీరోగా నటిస్తుండగా, ‘అంధాధున్’ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు.
1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. కేవలం 21 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అరుణ్ ఖేతర్‌పాల్ వీరగాథను, ఆయన ధైర్యసాహసాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. అద్భుతమైన పోరాట పటిమకు గుర్తింపుగా ఆయనకు మరణానంతరం పరమవీర చక్ర లభించింది.
ఈ చిత్రంలో ధర్మేంద్ర.. అరుణ్ ఖేతర్‌పాల్ తండ్రి బ్రిగేడియర్ ఎం.ఎల్. ఖేతర్‌పాల్ పాత్రలో కనిపించనున్నారు. దేశం కోసం కొడుకును కోల్పోయినా, ఒక సైనికుడిగా గర్వపడే తండ్రిగా ఆయన నటన భావోద్వేగభరితంగా ఉంది. ట్రైలర్‌లో ఆయన పలికిన సంభాషణలు, హావభావాలు ప్రేక్షకులను కదిలిస్తున్నాయి.
వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కావాల్సి ఉండగా, కొన్ని ఇతర పెద్ద సినిమాల కారణంగా వాయిదా పడింది. తాజాగా చిత్రబృందం కొత్త విడుదల తేదీని ప్రకటించింది. జనవరి 1న ‘ఇక్కీస్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ‘పాతాళ్ లోక్’ నటుడు జైదీప్ అహ్లావత్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.