Ram Vanji Sutar: ప్రముఖ శిల్పి, పద్మభూషణ్ రామ్ వంజీ సుతార్ మృతిపై కేసీఆర్ సంతాపం

Ram Vanji Sutar Ambedkar Statue Sculptor Dies KCR Condolences
  • రామ్ సుతార్‌ను శిల్పకళా రంగంలో కోహినూర్‌గా అభివర్ణించిన కేసీఆర్
  • ఆయన మరణం శిల్పకళా రంగానికి తీరని లోటని వ్యాఖ్య
  • ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచి ఉంటారన్న కేసీఆర్
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ రూపశిల్పి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత రామ్ వంజీ సుతార్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రామ్ సుతార్ శిల్ప కళా రంగంలో ఒక కోహినూర్ వజ్రం లాంటి వారని కేసీఆర్ కొనియాడారు.

"ప్రపంచ ప్రఖ్యాత శిల్పి అయిన రామ్ సుతార్ సేవలను, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ రూపంలో తెలంగాణ రాష్ట్రం వినియోగించుకోవడం గర్వకారణం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, అత్యంత సుందరంగా అంబేద్కర్ స్ఫురద్రూపాన్ని 125 అడుగుల ఎత్తులో తీర్చిదిద్దిన ఆయన తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు" అని అన్నారు.

ప్రముఖుల విగ్రహాలకు తన అద్భుతమైన ప్రతిభతో రూపం పోసిన రామ్ సుతార్ మరణం శిల్పకళా రంగానికి తీరని లోటని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. నిండు నూరేళ్ల జీవితాన్ని పరిపూర్ణంగా గడిపిన రామ్ సుతార్ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Ram Vanji Sutar
KCR
BRS
Telangana
Dr BR Ambedkar Statue
Sculptor
Padma Bhushan
Obituary
Indian Sculptor
Ram Sutar Death

More Telugu News