Naresh Agastya: 'గుర్రం పాపిరెడ్డి'... నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో నరేష్ అగస్త్య

Naresh Agastya in Gurram Papireddy with Four Different Getups
  • సరికొత్త డార్క్ కామెడీగా గుర్రం పాపిరెడ్డి
  • డిసెంబర్ 19న థియేటర్లలోకి వస్తున్న చిత్రం
  • నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం
  • తెలుగులో ఇప్పటివరకు రాని కథాంశం అంటున్న చిత్ర యూనిట్
తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచేందుకు 'గుర్రం పాపిరెడ్డి' అనే వెరైటీ డార్క్ కామెడీ చిత్రం సిద్ధమైంది. యంగ్ హీరో నరేష్ ఆగస్త్య, 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ సినిమా రేపు (డిసెంబర్ 19) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి కథాంశం రాలేదని, ఇది ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా దర్శకుడు మురళీ మనోహర్ మాట్లాడుతూ.. మన నేటివిటీకి దగ్గరగా ఉంటూనే, తెలుగులో ఇంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించామని తెలిపారు. నిర్మాతలు సైతం ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.

ఈ సినిమాలో తాను నాలుగు విభిన్న గెటప్స్‌లో, ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పాత్రలో కనిపించనున్నట్లు హీరో నరేష్ ఆగస్త్య చెప్పారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. తాను సౌదామిని అనే విభిన్న పాత్ర పోషించానని వెల్లడించారు.

డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ నిర్మించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణ సౌరభ్ సంగీతం అందించారు. 
Naresh Agastya
Gurram Papireddy
Faria Abdullah
Telugu Movie
Dark Comedy
Brahmanandam
Yogi Babu
Krishna Saurabh
Telugu Cinema

More Telugu News