Kalvakuntla Kavitha: 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్ర బృందానికి కవిత సన్మానం

Kalvakuntla Kavitha Felicitates Raju Weds Rambhaai Movie Team
  • ఇటీవల విడుదలై విజయం సాధించిన 'రాజు వెడ్స్ రాంబాయి'
  • టీమ్‌ను సన్మానించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
  • తెలంగాణ నేపథ్య కథను, నటీనటులను ప్రశంసించిన కవిత
  • నేటి నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా
ఇటీవల చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాధించిన 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్ర బృందాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అభినందించారు. గురువారం చిత్ర దర్శకుడు సాయిలు కంపాటి, నిర్మాత వేణు ఉడుగుల సహా ఇతర యూనిట్ సభ్యులను ఆమె శాలువాతో సత్కరించి ప్రశంసలు తెలిపారు. పూర్తి తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.

కవితను కలిసిన వారిలో చిత్ర నిర్మాత వేణు ఉడుగుల, దర్శకుడు సాయిలు కంపాటి, సమర్పకులు పూజారి నాగేశ్వర్ రావు, సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి, గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, నటుడు ఆదిత్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళీ పున్న తదితరులు ఉన్నారు. తమ చిత్ర విజయాన్ని అభినందించినందుకు వారు కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణకు చెందిన కొత్త దర్శకుడు సాయిలు కంపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరో, హీరోయిన్లుగా నటించగా, ప్రముఖ నటుడు సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ ఈ చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించాడు. నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.

కాగా, ఈ సినిమా నేటి నుంచే (డిసెంబర్ 18) ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను వీక్షించవచ్చు.
Kalvakuntla Kavitha
Raju Weds Rambhaai
Kavitha
Saiilu Kampati
Telangana Jagruthi
Telugu Movie
ETV Win
OTT Streaming
Akhil Raj
Theatres

More Telugu News