PVN Madhav: మీరు నీతులు చెప్పడమా?: షర్మిలపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ఫైర్

PVN Madhav Fires at Sharmila Over Criticism
  • ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై రగడ
  • మీరు నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని షర్మిలపై మాధవ్ విమర్శ
  • ఉపాధి హామీలో నకిలీ ఖాతాలతో గాంధీ ఆశయాలను చంపేశారని ఆరోపణ
  • పథకాలకు ఒకే కుటుంబం పేర్లు పెట్టి దేశాన్ని ధారాదత్తం చేశారని ఫైర్
  • మోదీ ప్రభుత్వం పనిదినాలు పెంచి, సకాలంలో జీతాలిస్తోందని వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహాత్ముడి పేరు అడ్డుపెట్టుకుని దశాబ్దాలుగా దేశాన్ని దోచుకున్న కాంగ్రెస్ నేతలు నీతులు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై షర్మిల చేస్తున్న విమర్శలను ఆయన గట్టిగా తిప్పికొట్టారు.

ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. "ఉపాధి హామీ పథకంలో నకిలీ ఖాతాలు సృష్టించి గాంధీజీ ఆశయాలను మీరు ఆనాడే చంపేశారు. దేశంలోని పథకాలకు సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయుల పేర్లు పెట్టకుండా, కేవలం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల పేర్లు పెట్టి ఒకే కుటుంబానికి దేశాన్ని ధారాదత్తం చేశారు" అని ఆరోపించారు.

ప్రధాని నరేంద్ర మోదీ గాంధీజీ ఆకాంక్షించిన 'గ్రామ స్వరాజ్యాన్ని' ఆచరణలో చూపిస్తూ కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారని మాధవ్ పేర్కొన్నారు. "ప్రధాని మోదీ ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పనిని 125 రోజులకు పెంచి పేదలకు అదనపు ఉపాధి కల్పిస్తున్నారు. వారంలోగా జీతాలు అందేలా చట్టబద్ధత కల్పిస్తున్నారు. రైతులకు, కూలీలకు ప్రయోజనం చేకూర్చేందుకు 'హార్వెస్ట్ పాజ్' వంటి విధానాలు తీసుకొచ్చారు. అవినీతిని రూపుమాపి, అభివృద్ధికి బాటలు వేస్తున్న ఈ పథకాన్ని స్వాగతించాల్సింది పోయి, అనవసర రాద్ధాంతం చేస్తూ ఈ ఏడుపు ఎందుకు?" అని మాధవ్ మండిపడ్డారు.
PVN Madhav
YS Sharmila
AP BJP
Andhra Pradesh Congress
MGNREGA
Narendra Modi
BJP criticism
Congress party
employment scheme
political news

More Telugu News