NTR Raju: ఎన్టీఆర్ రాజు పాడె మోసిన నందమూరి కుటుంబ సభ్యులు

NTR Raju Death Nandamuri Family Pays Tribute
  • నందమూరి తారక రామారావు వీరాభిమాని ఎన్టీఆర్ రాజు మృతి
  • తిరుపతిలో పార్థివదేహానికి నందమూరి సోదరుల నివాళి
  • అభిమాని పాడె మోసి నివాళులర్పించిన రామకృష్ణ, మోహనకృష్ణ
  • రెండుసార్లు టీటీడీ బోర్డు సభ్యుడిగా సేవలందించిన ఎన్టీఆర్ రాజు
  • రాజు మృతి తమ కుటుంబానికి తీరని లోటన్న నందమూరి సోదరులు
నందమూరి తారక రామారావు వీరాభిమాని ఎన్టీఆర్ రాజు మరణం టీడీపీకి, నందమూరి కుటుంబానికి తీరని లోటని నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం నాడు తిరుపతిలో ఎన్టీఆర్ రాజు పార్థివ దేహానికి నందమూరి కుటుంబం తరఫున నివాళులు అర్పించారు. రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం ఎన్టీఆర్ రాజు అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నందమూరి వీరాభిమానిగా ఎన్టీఆర్ రాజు ఎనలేని సేవలందించారన్నారు. రెండు సార్లు టీటీడీ బోర్డు మెంబర్ గా ఎన్టీఆర్ రాజు భక్తులకు విస్తృత సేవలందించారని గుర్తు చేశారు. టీటీడీ అభివృద్ధికి అనేక సూచనలిచ్చినట్లు వారు తెలిపారు. ఆయన మృతి యావత్ నందమూరి అభిమానులకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుటున్నట్టు పేర్కొన్నారు. వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నామని తెలిపారు.
NTR Raju
Nandamuri Taraka Rama Rao
Nandamuri family
TDP
Tirupati
TTD Board Member
Nandamuri Ramakrishna
Nandamuri Mohana Krishna
Andhra Pradesh

More Telugu News