iBomma Ravi: విచారణలో నోరు విప్పిన ఐబొమ్మ రవి.. పైరసీ ఎలా చేశాడో చెప్పేశాడు!

iBomma Ravi Revealed Piracy Method via Telegram Channel HD Hub
  • శాటిలైట్ లింక్, క్యూబ్ నెట్‌వర్క్ హ్యాక్ చేసినట్లు వెల్లడి
  • హెచ్‌డీ హబ్ టెలిగ్రామ్ ఛానల్‌ ద్వారా పైరసీ లింకుల అమ్మకం
  • ఒక్కో లింక్‌కు 300 డాలర్ల వరకు వసూలు
ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు రవి కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో అతడు సినిమా పైరసీకి పాల్పడిన విధానాన్ని వెల్లడించాడు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కొత్త సినిమాల పైరసీ ప్రింట్లతో వ్యాపారం చేసినట్లు ఒప్పుకున్నాడు.

ఈరోజు జరిగిన విచారణలో పైరసీకి సంబంధించిన కీలక వివరాలను రవి వెల్లడించాడు. కేవలం సాధారణ ప్రింట్లే కాకుండా, ఏకంగా క్యూబ్ నెట్‌వర్క్‌ను, శాటిలైట్ లింక్‌ను హ్యాక్ చేసి సినిమాలను హెచ్‌డీ ఫార్మాట్‌లో రికార్డు చేసినట్లు తెలిపాడు. ఈ విధంగా పైరసీ చేసిన సినిమాలను అమ్మేందుకు 'హె‌చ్‌డీ హబ్' పేరుతో ప్రత్యేకంగా ఒక టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేసినట్లు చెప్పాడు. ఈ ఛానల్‌లో పైరసీ లింకులను అప్‌లోడ్ చేసి, ఒక్కో లింక్‌కు 100 నుంచి 300 డాలర్ల వరకు వసూలు చేసినట్లు స్పష్టం చేశాడు. ముఖ్యంగా 'హిట్-3', 'కిష్కిందపురి' సినిమాలను శాటిలైట్ లింక్ ద్వారానే పైరసీ చేసినట్లు అంగీకరించాడు.

ఈ నేపథ్యంలో, మూడు వేర్వేరు కేసుల్లో విచారణ నిమిత్తం నాంపల్లి కోర్టు ఇమ్మడి రవికి 12 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. కోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం చంచల్‌గూడ జైలు నుంచి అతడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. 
iBomma Ravi
iBomma
Ravi
movie piracy
piracy website
HD Hub
Telegram channel
cyber crime
Hit 3 movie
Kishkindapuri movie

More Telugu News