India: బంగ్లాదేశ్‌లో రెండు వీసా కేంద్రాలను మూసివేసిన భారత్
- రాజ్షాహి, ఖుల్నాలలోని భారత వీసా కేంద్రాల మూసివేత
- ప్రకటించిన బంగ్లాదేశ్‌లోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్
- షెడ్యూల్ అయిన అపాయింట్మెంట్లకు మరో తేదీన అవకాశం కల్పిస్తామని వెల్లడి
బంగ్లాదేశ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ముట్టడించేందుకు కొందరు ప్రయత్నించిన నేపథ్యంలో, భద్రతా కారణాల దృష్ట్యా భారత్ అక్కడి రెండు వీసా కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసింది. ఢాకాలోని వీసా కేంద్రాన్ని ఇంతకుముందు మూసివేసినప్పటికీ, దానిని తిరిగి తెరిచినట్లు సమాచారం.
భద్రతాపరమైన కారణాల దృష్ట్యా రాజ్షాహి, ఖుల్నాలలోని భారత వీసా కేంద్రాలను మూసివేస్తున్నట్లు బంగ్లాదేశ్‌లోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ ప్రకటించింది. గురువారం షెడ్యూల్ అయిన అపాయింట్మెంట్లకు మరో తేదీని కేటాయిస్తామని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో ఢాకా, రాజ్షాహి, ఖుల్నాల, చత్తోగ్రామ్, సిల్హెత్ నగరాల్లో ఐదు వీసా కేంద్రాలు కొనసాగుతున్నాయి.