బంగ్లాదేశ్‌లో రెండు వీసా కేంద్రాలను మూసివేసిన భారత్
- రాజ్‌షాహి, ఖుల్నాలలోని భారత వీసా కేంద్రాల మూసివేత
- ప్రకటించిన బంగ్లాదేశ్‌లోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్
- షెడ్యూల్ అయిన అపాయింట్‌మెంట్లకు మరో తేదీన అవకాశం కల్పిస్తామని వెల్లడి
భద్రతాపరమైన కారణాల దృష్ట్యా రాజ్‌షాహి, ఖుల్నాలలోని భారత వీసా కేంద్రాలను మూసివేస్తున్నట్లు బంగ్లాదేశ్‌లోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ ప్రకటించింది. గురువారం షెడ్యూల్ అయిన అపాయింట్‌మెంట్లకు మరో తేదీని కేటాయిస్తామని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో ఢాకా, రాజ్‌షాహి, ఖుల్నాల, చత్తోగ్రామ్, సిల్‌హెత్ నగరాల్లో ఐదు వీసా కేంద్రాలు కొనసాగుతున్నాయి.