YS Raja Reddy: హ్యాపీ బర్త్ డే రాజా... తనయుడికి వైఎస్ షర్మిల ఎమోషనల్ బర్త్ డే విషెస్

YS Sharmilas Emotional Birthday Wishes to Son Raja Reddy
  • కుమారుడు వైఎస్ రాజారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన షర్మిల
  • నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నానంటూ భావోద్వేగ పోస్ట్
  • నీ విశ్వాసం, పట్టుదల నాకు స్ఫూర్తినిస్తాయి అంటూ ట్వీట్  
  • రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశంపై కొంతకాలంగా చర్చ
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. తన కుమారుడిని చూసి తాను ఎంతో గర్వపడుతున్నానని పేర్కొన్నారు.

"పుట్టినరోజు శుభాకాంక్షలు రాజా! ఒక మంచి వ్యక్తిగా నువ్వు ఎదిగిన తీరు చూసి నేను చాలా గర్వపడుతున్నాను. నీ విశ్వాసం, ఉత్సాహం, పట్టుదల నాకు ప్రతిరోజూ స్ఫూర్తినిస్తాయి. నీ ఆత్మ వర్ధిల్లినట్లే, నువ్వు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లి ఆరోగ్యంగా ఉండాలి! మరెన్నో సాహసాలు, విజయాలతో నిండిన మరో సంవత్సరం నీకు దక్కాలని కోరుకుంటున్నాను. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను! అమ్మ" అని షర్మిల తన పోస్టులో పేర్కొన్నారు.

వైఎస్ షర్మిల, ప్రముఖ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ దంపతులకు కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలిరెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో రాజారెడ్డి తన తల్లి షర్మిలతో కలిసి పలు రాజకీయ, ఇతర కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. దీంతో ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి ప్రవేశించవచ్చని విస్తృతంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల పెట్టిన ఈ వ్యక్తిగత పోస్ట్ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
YS Raja Reddy
YS Sharmila
APCC
Andhra Pradesh Congress Committee
Brother Anil Kumar
Anjali Reddy
Political Entry
Birthday Wishes
Raja Reddy Politics

More Telugu News