MGNREGA: ఉపాధి హామీ చట్టం రద్దు.. కొత్త బిల్లుకు లోక్‌సభ ఆమోదం

MGNREGA Replacement Bill Approved in Loksabha
  • మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త బిల్లు
  • ‘వీబీ జీ రామ్‌ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
  • విపక్షాల తీవ్ర నిరసనల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ‘వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌-గ్రామీణ్‌’ (వీబీ జీ రామ్‌ జీ) పేరుతో రూపొందించిన ఈ బిల్లుపై గురువారం సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

ఈ బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలువురు ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించి సభలో విసిరేశారు. విపక్షాల ఆందోళనలు, నినాదాల నడుమనే స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా.. మూజువాణి ఓటుతో బిల్లు నెగ్గినట్లు ప్రకటించారు.

ప్రతిపక్షాల నిరసనలతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో, స్పీకర్ లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు. ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ ఉపాధి వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
MGNREGA
Employment Guarantee Act
Vikshit Bharat Guarantee
Loksabha
Indian Parliament
Rural Employment
NREGA Bill
Opposition Protest
Government Schemes
Rural India

More Telugu News