Hindustan Aeronautics Limited: ఐటీఐ అర్హతతో హెచ్ఏఎల్ లో ఉద్యోగాలు

Hindustan Aeronautics Limited Announces ITI Based Job Openings
  • ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  • ఈ నెల 25తో ముగియనున్న దరఖాస్తు గడువు
  • రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. 156 ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 25 తుది గడువుగా నిర్ణయించింది.

ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ 7, ఫిట్టింగ్ 115, గ్రౌండింగ్ 4, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్/ఇనుస్ట్రుమెంటేషన్ 05, మ్యాచింగ్ 12, టర్నింగ్ 12, ఫిట్టింగ్ 01.

అర్హతలు: సంబంధిత విభాగంలో మూడేండ్ల నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ లేదా రెండేండ్ల ఐటీఐతోపాటు ఏడాది నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ తప్పనిసరి.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వ్డ్ వర్గాలకు సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
Hindustan Aeronautics Limited
HAL Recruitment
ITI Jobs
Central Government Jobs
Operator Posts
HAL Careers
Apprentice Certificate
Government Jobs
Electronics Jobs
Fitter Jobs

More Telugu News