Viral Videos: సౌదీలో అరుదైన దృశ్యం.. ఎడారిని కప్పేసిన మంచు!

Saudi Arabia Experiences Rare Snowfall in Desert Regions
  • సౌదీ అరేబియాలో పలుచోట్ల భారీ హిమపాతం
  • మంచుతో కప్పబడిన ఇళ్లు, వాహనాలు, రోడ్లు
  • అరుదైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్న స్థానికులు
  • రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
సౌదీ అరేబియా అనగానే మనకు ఎడారులు, వేడి వాతావరణం గుర్తుకొస్తుంది. కానీ, అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఎడారి దేశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. రోడ్లు, ఇళ్లు, వాహనాల పైకప్పులు మంచుతో పూర్తిగా కప్పబడిపోయాయి. రహదారులన్నీ తెల్లటి తివాచీ పరిచినట్లు కనువిందు చేస్తున్నాయి. ఈ ఊహించని మంచు వర్షాన్ని చూసి స్థానిక ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.

ఇటీవల సౌదీలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా మంచు కురవడం అక్కడి వాతావరణంలో వస్తున్న మార్పులకు సంకేతంగా నిలుస్తోంది.

మరోవైపు దేశంలో రానున్న రోజుల్లో వాతావరణం మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని సౌదీ వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Viral Videos
Saudi Arabia
Saudi Arabia snow
Saudi Arabia weather
Arabian desert
Middle East weather
Saudi weather forecast
snow in desert
heavy rainfall
floods

More Telugu News