Chhattisgarh Maoists: మావోయిస్టులకు మరో షాక్.. ఎన్‌కౌంటర్ లో ముగ్గురు మావోల మృతి

Chhattisgarh Maoists Encounter 3 Naxalites Killed in Sukma
  • ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఎదురుకాల్పులు
  • గొల్లపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల ఆపరేషన్
  • ఇంకా కొనసాగుతున్న గాలింపు చర్యలు
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఈ తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. గొల్లపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో ప్రస్తుతం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. సుక్మా జిల్లాలోని గొల్లపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బలగాలు అడవిని జల్లెడ పడుతుండగా, మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఎదురుకాల్పులు ప్రారంభించారు.

ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఆపరేషన్ ముగిసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ మధ్యకాలంలో ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని భద్రతా బలగాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే.
Chhattisgarh Maoists
Sukma district
Maoist encounter
Gollapalli
Chhattisgarh
Naxalites
Anti-Naxal operation
Security forces
Operation Kagar

More Telugu News