రామ్మోహన్ నాయుడికి ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్.. మంత్రి పనితీరు అద్భుతమంటూ కితాబు
- పౌర విమానయాన రంగంలో కేంద్ర మంత్రి కృషిని కొనియాడిన ప్రధాని
- అమిత్ షా, గడ్కరీ, యోగి ఆదిత్యనాథ్‌ల నుంచి కూడా మంత్రికి విషెస్
- రామ్మోహన్ పనితీరు గర్వకారణమన్న మంత్రి నారా లోకేశ్
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పౌర విమానయాన రంగంలో సంస్కరణల కోసం రామ్మోహన్ నాయుడు విస్తృతంగా కృషి చేస్తున్నారంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు.
ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ప్రధాని ఒక పోస్ట్ చేశారు. "కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పౌర విమానయాన రంగంలో సంస్కరణల కోసం ఎంతగానో కృషి చేస్తున్న ఒక యువ నాయకుడు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నాను" అని మోదీ పేర్కొన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా రామ్మోహన్ నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
అలాగే, ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా రామ్మోహన్ నాయుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. "నా ప్రియ సోదరుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు. మీ నిబద్ధత, పనితీరును దగ్గర నుంచి చూశాను. భారత విమానయాన రంగాన్ని మీరు తీర్చిదిద్దుతున్న తీరు గర్వంగా ఉంది" అని లోకేశ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
1987లో జన్మించిన రామ్మోహన్ నాయుడు, 2024 నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి 16, 17, 18వ లోక్‌సభలకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2025లో ఆయన సొంత జిల్లాకు చెందిన పొందూరు ఖాదీకి భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ లభించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.