Vikranth: ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి వస్తున్న కొత్త సినిమా
- విక్రాంత్, చాందినీ చౌదరిల 'సంతాన ప్రాప్తిరస్తు'
- అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్‌లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్
- నవంబరులో థియేటర్లలో విడుదలైన చిత్రం
- సంతాన సమస్యల నేపథ్యంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన ఫ్యామిలీ డ్రామా 'సంతాన ప్రాప్తిరస్తు' ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ఒకేసారి రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. డిసెంబర్ 19వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నవంబరులో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను పలకరించింది. ఇందులో ఆమని, తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.
ఇక కథ విషయానికొస్తే.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే చైతన్య (విక్రాంత్), కల్యాణి (చాందినీ) ప్రేమించుకుని, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత పిల్లల కోసం ప్రయత్నించగా, చైతన్యలో సంతాన సమస్య ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సమస్య కారణంగా వారి వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? సామాజికంగా ఎటువంటి అవమానాలను ఎదుర్కొన్నారు? అనే సున్నితమైన అంశాల చుట్టూ కథ నడుస్తుంది. చివరికి వారు తమ కలను నెరవేర్చుకున్నారా లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.