Congress Party: గ్రామ పంచాయతీ ఎన్నికలు... మూడో దశలోనూ సత్తా చాటిన కాంగ్రెస్
- మూడో దశలో 4,158 స్థానాల్లో ఎన్నికలు
- 2,230కి పైగా గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ విజయం
- వెయ్యికి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో ఎన్నికలు జరగగా, అన్నింటా అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మూడో దశలో 4,158 స్థానాల్లో ఎన్నికలు జరగగా, 2,230కి పైగా పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. కౌంటింగ్ చివరి దశకు చేరుకోగా, 1150 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది.
మూడు దశల్లో కలిపి 12,726 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, కొన్ని మినహా అన్ని స్థానాల్లో ఫలితాలు వచ్చాయి. వీటిలో 6,800కు పైగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, 3,500కు పైగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ సుమారు 700 స్థానాలు దక్కించుకుని తన ఉనికిని చాటుకుంది.
మూడో దశలో కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.