Bharat Taxi: జీరో కమీషన్ మోడల్.. జనవరి 1 నుండి ఢిల్లీలో 'భారత్ ట్యాక్సీ' యాప్

Bharat Taxi App Launching in Delhi January 1
  • ప్రైవేటు సంస్థలకు పోటీగా క్యాబ్ హెయిలింగ్ సేవలు
  • కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో క్యాబ్ సేవలు
  • జనవరి 1 నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ప్రారంభం
ఢిల్లీ ప్రభుత్వం భారత్ ట్యాక్సీ యాప్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఊబర్, ఓలా, రాపిడో వంటి ప్రైవేటు సంస్థలు అందిస్తున్న క్యాబ్ హెయిలింగ్ సేవలకు ప్రత్యామ్నాయంగా ఇది రానుంది. కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా కో-ఆపరేటివ్ క్యాబ్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి.

ఢిల్లీ వాసులకు నూతన సంవత్సర కానుకగా జనవరి 1న భారత్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్రం ప్రకటన చేసింది. ఆ తర్వాత ఈ యాప్ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో ఆటో, క్యాబ్, బైక్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఢిల్లీలో ఈ సేవలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

జీరో కమీషన్ మోడల్

ఈ యాప్ జీరో కమీషన్ మోడల్ ఆధారంగా రూపొందించబడింది. కో-ఆపరేటివ్ లిమిటెడ్ ద్వారా ఈ సహకార ట్యాక్సీ నిర్వహించబడుతుంది. ఢిల్లీవాసులు జనవరి 1 నుంచి ఆటో, ట్యాక్సీ, బైక్ సేవలను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు వారి మొబైల్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఈ భారత్‌ ట్యాక్సీ యాప్‌ ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. ఇదివరకు ఉన్న క్యాబ్‌ ఛార్జీల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా, ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండానే ఈ సేవలను పొందే అవకాశముంది. సుమారు 56 వేల మంది డ్రైవర్లు భారత్‌ ట్యాక్సీ యాప్‌లో రిజిస్ట్రర్‌ చేసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ సేవల్లో రైడ్‌ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని డ్రైవర్లకే చెల్లిస్తారు. అతి తక్కువ నామినల్‌ రుసుముతో డ్రైవర్లు ఈ ప్లాట్‌ఫాంలో పనిచేయవచ్చు.
Bharat Taxi
Delhi
Zero Commission Model
Cab Service
Ola
Uber
Rapido
Cooperative Cab Service

More Telugu News