Akshaye Khanna: 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని హీరో.. గతంలో కరిష్మా కపూర్ తో లవ్!

Akshaye Khanna at 50 Unmarried Despite Past Romance with Karishma Kapoor
  • 19 ఏళ్లకే జుట్టు రాలడంతో ఇబ్బందిపడ్డ అక్షయ్ ఖన్నా
  • 'బోర్డర్' సినిమాతో కెరీర్‌లో బ్రేక్ అందుకున్న నటుడు
  • 'చావా'లో ఔరంగజేబు పాత్రతో ఇటీవల గ్రాండ్ కమ్‌బ్యాక్
బాలీవుడ్‌లో అందం, ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, దివంగత నటుడు వినోద్ ఖన్నా కుమారుడైన అక్షయ్ ఖన్నా మాత్రం ఇందుకు భిన్నం. 19 ఏళ్లకే బట్టతల సమస్యతో బాధపడినా, తన నటననే నమ్ముకుని పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. తాజాగా 'చావా', 'ధురంధర్' చిత్రాలతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.

కెరీర్ ప్రారంభంలోనే అక్షయ్ ఖన్నా తీవ్రమైన జుట్టు రాలే సమస్యను ఎదుర్కొన్నారు. 19 ఏళ్లకే తలపై జుట్టు పలచబడటంతో సినిమా అవకాశాలు వస్తాయో రావో అని తీవ్రంగా ఆందోళన చెందారు. ఆ సమయంలో లుక్ కంటే టాలెంట్‌తోనే నెగ్గుకురావాలని నిర్ణయించుకున్నారు. తండ్రి వినోద్ ఖన్నా నిర్మించి, నటించిన 'హిమాలయ పుత్ర' (1997) చిత్రంతో అక్షయ్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అయితే ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన 'బోర్డర్' చిత్రం ఆయన కెరీర్‌కు గట్టి పునాది వేసింది.

ఈ సినిమా తర్వాత అక్షయ్ వెనుదిరిగి చూసుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'దిల్ చాహ్తా హై', 'హమ్‌రాజ్', 'రేస్', 'దృశ్యం 2' వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సుమారు మూడేళ్ల విరామం తర్వాత 'చావా'లో ఔరంగజేబు పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ధురంధర్ చిత్రంతో అతడి పేరు మరోసారి ఘనంగా వినిపించింది.

ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే, అక్షయ్ ఖన్నా లైమ్‌లైట్‌కు, పార్టీలకు దూరంగా ఉంటారు. 50 ఏళ్లు వచ్చినా ఆయవ ఇంకా పెళ్లి చేసుకోలేదు. గతంలో నటి కరిష్మా కపూర్‌తో ప్రేమలో ఉన్నప్పటికీ, అది పెళ్లి వరకు వెళ్లలేదు. 28 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో అక్షయ్ సుమారు రూ.167 కోట్ల ఆస్తిని కూడబెట్టినట్లు అంచనా. 
Akshaye Khanna
Bollywood
Vinod Khanna
Karishma Kapoor
Chava
Dhurandar
Himalaya Putra
Dil Chahta Hai
Humraaz
marriage

More Telugu News